Share News

మంటలార్పే రోబోలు.. అంతకంటే వేగంగా డ్రోన్‌లు!

ABN , Publish Date - Apr 19 , 2026 | 04:09 AM

ఎగసిపడే మంటల్లోకి ఫైర్‌ రోబోలు దూసుకువెళ్లి రసాయనాలను వెదజల్లి వాటిని అదుపులోకి తెచ్చాయి.

మంటలార్పే రోబోలు.. అంతకంటే వేగంగా డ్రోన్‌లు!

  • అబ్బురపరచిన అగ్నిమాపక విన్యాసాలు

విశాఖపట్నం, ఏప్రిల్‌ 18(ఆంధ్రజ్యోతి): ఎగసిపడే మంటల్లోకి ఫైర్‌ రోబోలు దూసుకువెళ్లి రసాయనాలను వెదజల్లి వాటిని అదుపులోకి తెచ్చాయి. వాహనాలు వెళ్లడానికి వీల్లేని ప్రాంతంలో అగ్ని ప్రమాదాన్ని నియంత్రించేందుకు రసాయనం కలిగిన ట్యాంకర్‌తో డ్రోన్‌ వెళ్లింది. మంటల్లో చిక్కుకుని సహాయం కోసం అర్థిస్తున్న బాధితుడిని దుప్పటి మాదిరిగా ఉండే ‘జెల్‌ బ్లాంకెట్‌’ను కప్పుకున్న వ్యక్తి వెళ్లి సురక్షితంగా బయటికి తీసుకువచ్చాడు. ఇలా జిల్లా అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం ఆర్కే బీచ్‌లో ప్రదర్శించిన విన్యాసాలు అబ్బురపరిచాయి. అపార్టుమెంట్లు, ట్రావెల్స్‌ బస్సుల్లో అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ప్రయాణికులను బయటకు తీసుకొచ్చి సీపీఆర్‌, ప్రాథమిక చికిత్స అందజేసి కాపాడటం వంటి ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. హోంమంత్రి అనిత ఈ కార్యక్రమానికి హాజరై ఈ విన్యాసాలను తిలకించారు.

Updated Date - Apr 19 , 2026 | 04:10 AM