Share News

శేషాచల కొండల్లో కార్చిచ్చు

ABN , Publish Date - Apr 27 , 2026 | 06:22 AM

శేషాచల కొండల్లో కార్చిచ్చు రేగింది.తిరుపతి శివారు ప్రాంతమైన జీవకోన పైభాగంలోని అటవీ ప్రాంతంలో ఆదివారం మధ్యాహ్నం 3గంటల..

శేషాచల కొండల్లో కార్చిచ్చు

తిరుపతి(కపిలతీర్థం),ఏప్రిల్‌ 26(ఆంధ్రజ్యోతి): శేషాచల కొండల్లో కార్చిచ్చు రేగింది.తిరుపతి శివారు ప్రాంతమైన జీవకోన పైభాగంలోని అటవీ ప్రాంతంలో ఆదివారం మధ్యాహ్నం 3గంటల ప్రాంతంలో అనూహ్యంగా మంటలు చెలరేగాయి. ఆ అగ్నిజ్వాలలు కిలోమీటర్లమేర వ్యాపించడంతో అటవీశాఖ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను ఆర్పడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.అయితే రాత్రి 10గంటలకు కూడా మంటలు అదుపులోకి రాలేదు.రాత్రికే మంటలను అదుపులోకి తీసుకొస్తామని తిరుపతి రేంజ్‌ ఆఫీసర్‌ సుదర్శన్‌రెడ్డి చెప్పారు.మంటలు ఎలా వ్యాపించాయనేది తెలియాల్సి ఉందన్నారు.

Updated Date - Apr 27 , 2026 | 06:23 AM