Fire Accident: తుని రైల్వేస్టేషన్‌లో అగ్నిప్రమాదం
ABN , Publish Date - Jan 08 , 2026 | 04:40 AM
కాకినాడ జిల్లా తుని రైల్వేస్టేషన్‌లో అగ్నిప్రమాదం జరిగింది. బుధవారం మధ్యాహ్నం రైల్వేస్టేషన్ ముఖ ద్వారం పైన...
కమ్ముకున్న పొగలు.. పరుగులు తీసిన ప్రయాణికులు
తుని రూరల్, జనవరి 7 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా తుని రైల్వేస్టేషన్‌లో అగ్నిప్రమాదం జరిగింది. బుధవారం మధ్యాహ్నం రైల్వేస్టేషన్ ముఖ ద్వారం పైన ఎలక్ర్టికల్ ఎనౌస్‌మెంట్ బోర్డు సమీపంలో మంటలు చెలరేగి పొగలు కమ్ముకున్నాయి. దీంతో ప్రయాణికులు అక్కడ నుంచి పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పి పరిస్థితిని చక్కదిద్దారు. అగ్నిప్రమాదానికి కారణంపై రైల్వేస్టేషన్ అధికారులు, జీఆర్పీ పోలీసులు స్పష్టత ఇవ్వడం లేదు. మతిస్థితిమితం లేని వ్యక్తిని జీఆర్పీ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది.