సబ్సిడీతో ఎరువులు, విత్తనాలు అందించాలి
ABN , Publish Date - Jun 02 , 2026 | 12:05 AM
ఖరీ్‌ఫకు సిద్ధమవుతున్న రైతుల కు అవసరమయ్యే విత్తనాలు, ఎరువులు, పురుగు మందులను 90 శాతం సబ్సిడీతో ఇచ్చి ఆదుకోవాలని రైతు సంఘం రాష్ట్ర గౌ రవాధ్యక్షులు రామచంద్రయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
రైతు సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు
రామచంద్రయ్య
రెవెన్యూ కార్యాలయం ఎదుట ధర్నా
తహసీల్దార్‌కు
వినతి పత్రం అందజేత
పత్తికొండ టౌన్, జూన్ 1 (ఆంధ్ర జ్యోతి): ఖరీ్‌ఫకు సిద్ధమవుతున్న రైతుల కు అవసరమయ్యే విత్తనాలు, ఎరువులు, పురుగు మందులను 90 శాతం సబ్సిడీతో ఇచ్చి ఆదుకోవాలని రైతు సంఘం రాష్ట్ర గౌ రవాధ్యక్షులు రామచంద్రయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం రైతు సంఘం ఆధ్వర్యంలో స్థానిక సీఆర్ భవన్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు రైతులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం ఎదుట జరిగిన ధర్నా చేపట్టారు. అనంతరం తహసీల్దార్ కు వినతి పత్రం అందజేశారు. కార్యక్ర మంలో రైతు సంఘం జిల్లా సహాయ కార్య దర్శి రాజాసాహెబ్, ని యోజకవర్గ ప్రధాన కా ర్యదర్శి సురేంద్రకుమా ర్, గౌరవాధ్యక్షులు కార న్న, మండలాధ్యక్షులు పెద్దముని, సీపీఐ నా యకులు పాల్గొన్నారు.
వెల్దుర్తి: ఎరువుల ధరలను తగ్గిం చా లని సీపీఐ మండల కార్యదర్శి కృష్ణ ప్రభు త్వాన్ని డిమాండ్ చేశారు. సో మవారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని తహసీల్దార్ చంద్ర శేఖర్‌వర్మకు అందజేశారు.
మద్దికెర: రైతులకు ఖరీ్‌ఫలో అవసరమ య్యే రాయితీ వేరుశనగ విత్తనాలు వెంటనే ఇవ్వాలని సీపీఐ మం డల కార్యదర్శి నాగరాజు కోరారు. సోమవా రం సీపీఐ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాల యం ముందు ధర్నా చేపట్టారు. వినతి పత్రాన్ని తహసీల్దార్‌కు అందజేశారు.
ఆదోని రూరల్ : అన్నదాతలను ఆదు కోవాలని, పెంచిన ఎరువుల ధరలను తగ్గించాలని సీపీఐ నాయకులు బసాపురం గోపాల్ డిమాండ్ చేశారు. సీపీఐ రైతు సంఘం ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించి తహసీ ల్దార్ శేషుఫణికి వినతిపత్రం సమర్పించారు.