రేపు ఐచ్ఛిక సెలవు
ABN , Publish Date - Feb 15 , 2026 | 04:17 AM
ప్రభుత్వం ఈ నెల 16వ తేదీని ఐచ్ఛిక సెలవుగా ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ శనివారం ఈ ఉత్తర్వులు జారీ చేశారు.
అమరావతి, ఫిబ్రవరి 14(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం ఈ నెల 16వ తేదీని ఐచ్ఛిక సెలవుగా ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ శనివారం ఈ ఉత్తర్వులు జారీ చేశారు. 15వ తేదీ మహాశివరాత్రి నేపథ్యంలో ప్రజలు ప్రత్యేక పూజలతోపాటు ఆదివారం రాత్రి జాగరణ చేయనున్నారు. అందువల్ల సోమవారం ఐచ్ఛిక సెలవుగా ప్రకటించాలని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ ప్రభుత్వానికి విన్నవించారు. ఆ విన్నపం మేరకు ప్రభుత్వం 16వ తేదీని ఐచ్ఛిక సెలవుగా ప్రకటించింది. గతేడాది డిసెంబరు 4వ తేదీన ఇచ్చిన ఉత్తర్వులకు ఈ మేరకు చిన్న సవరణ చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది.