Chittoor District: కూతురిపై తండ్రి అఘాయిత్యం
ABN , Publish Date - Jan 03 , 2026 | 05:42 AM
కూతురిపై కన్న తండ్రే అఘాయిత్యానికి పాల్పడిన ఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది.
పెద్దపంజాణి, జనవరి 2(ఆంధ్రజ్యోతి): కూతురిపై కన్న తండ్రే అఘాయిత్యానికి పాల్పడిన ఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.... పెద్దపంజాణి మండలంలో ఓ కాలనీకి చెందిన వ్యక్తికి ఇద్దరు భార్యలు. మొదటి భార్య అనారోగ్యంతో మృతి చెందింది. ఆమెకు 12ఏళ్ల కుమార్తె ఉంది. శుక్రవారం సాయంత్రం ఆ అమ్మాయి ఇంటికి వస్తుండగా మార్గమధ్యలో తండ్రి బలవంతం చేయబోయాడు. ఆమె కేకలు వేయడంతో సమీపంలోనే ఉన్న అతడి తల్లి అడ్డుకుంది. దీంతో ఆమెను చితకబాది కూతురిని చెట్లలోకి లాక్కుపోయాడు. దెబ్బలు తిన్న అతడి తల్లి పరుగున కాలనీకి చేరుకుని గ్రామస్థులకు విషయం తెలిపింది. అందరూ ఘటనా స్థలానికి వెళ్లేసరికి అప్పటికే తన మనవరాలిని మానభంగంచేసి పరారయ్యాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. బాధితురాలితో స్టేషన్‌కు వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.