పంటలకు లాభసాటి ధరలు అందించేలా చర్యలు
ABN , Publish Date - Mar 26 , 2026 | 03:26 AM
రాష్ట్రంలో రైతుల పంటలకు లాభసాటి ధరలు అందించేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు...
సింగపూర్ ప్రతినిధులతో మంత్రి అచ్చెన్న చర్చలు
అమరావతి, మార్చి 25(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రైతుల పంటలకు లాభసాటి ధరలు అందించేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. బుధవారం విజయవాడ క్యాంప్ ఆఫీస్ నుంచి సింగపూర్ ప్రతినిధులతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వ్యవసాయ రంగంలో గ్లోబల్ కనెక్టివిటీ, ఆహార భద్రత, సరఫరా వ్యవస్థలు, ఆధునిక సాంకేతికత వినియోగంపై వారితో చర్చించారు. ఏపీలో వ్యవసాయరంగ అభివృద్ధికి ఉన్న అవకాశాలు, ఎగుమతుల పెంపు, ఆధునిక సాంకేతిక వినియోగం, పెట్టుబడుల ఆహ్వానం వంటి అంశాలను మంత్రి వివరించారు. ఆహార ఉత్పత్తుల సంరక్షణ, సమర్ధ రవాణా నిర్వహణపై సింగపూర్‌లో అమలు చేస్తున్న విధానాలను వారు వివరించారు. కోల్డ్ స్టోరేజ్ మేనేజ్‌మెంట్‌పైనా చర్చించారు.