Share News

రైతులను ఆదుకోవాలి

ABN , Publish Date - Sep 28 , 2026 | 11:58 PM

రైతులను ఆదుకో వాలని మాజీ ఎమ్మెల్యే సా యిప్రసాద్‌రెడ్డి డిమాండ్‌ చే శారు.

రైతులను ఆదుకోవాలి

ఆదోని రూరల్‌, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి) : రైతులను ఆదుకో వాలని మాజీ ఎమ్మెల్యే సా యిప్రసాద్‌రెడ్డి డిమాండ్‌ చే శారు. సోమవారం సలకల కొండలో వైసీపీ నాయకులతో కలిసి మాజీ ఎమ్మెల్యే పర్యటిం చారు. రైతుల పంట పొలాలను పరిశీలించారు. పలువురు రైతులు గోడును మాజీ ఎమ్మెల్యే కు వినిపించారు. బంగారు తాకట్టు పెట్టి ఇన్సూరెన్స కట్టామని, కనీసం ఇన్సూరెన్స డబ్బులు వచ్చేలా చూడాలని మహిళ రైతు కృష్ణమ్మ వేడుకున్నారు. వైసీపీ ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. నాయకులు చంద్రకాంతరెడ్డి, శేషిరెడ్డి, నల్లారెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Sep 28 , 2026 | 11:58 PM