Share News

‘అమరావతి’ చరిత్రలో నిలిచిపోతుంది

ABN , Publish Date - Mar 29 , 2026 | 05:04 AM

అమరావతే రాష్ట్ర ఏకె ౖక రాజధానిగా చట్టబద్ధత కల్పించేందుకు కూటమి ప్రభుత్వం శనివారం అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టి కేంద్రానికి పంపటంపై రైతు జేఏసీ నేతలు హర్షం వ్యక్తం చేశారు.

‘అమరావతి’ చరిత్రలో నిలిచిపోతుంది

  • ‘ఏకైక రాజధాని’ తీర్మానంపై రైతు జేఏసీ హర్షం

  • సీఎం చంద్రబాబును కలిసి ధన్యవాదాలు

అమరావతి, తుళ్లూరు, మార్చి 28(ఆంధ్రజ్యోతి): అమరావతే రాష్ట్ర ఏకె ౖక రాజధానిగా చట్టబద్ధత కల్పించేందుకు కూటమి ప్రభుత్వం శనివారం అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టి కేంద్రానికి పంపటంపై రైతు జేఏసీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. అసెంబ్లీకి తరలివచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే దిశగా చేసిన ఈ తీర్మానం చరిత్రలో నిలిచిపోతుందని వారు సీఎంతో అన్నారు. సీఎంను కలిసినవారిలో జేఏసీ నేతలు గద్దె తిరుపతిరావు, రైతులు పువ్వాడ సుధాకర్‌, జమ్ముల శ్యాం కిశోర్‌, కొమ్మినేని సత్యం, బెల్లంకొండ నరసింహరావు, స్వరాజ్యరావు, కారుమంచి నరేంద్ర ఉన్నారు. సీఎంని కలవడానికి ముందు మంత్రి లోకేశ్‌ను కూడా కలిసి ధన్యవాదాలు తెలిపారు.

Updated Date - Mar 29 , 2026 | 05:05 AM