Share News

రైతుల సంక్షేమమే కూటమి లక్ష్యం: అచ్చెన్న

ABN , Publish Date - Jun 21 , 2026 | 04:23 AM

రైతు సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తున్నదని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు.

రైతుల సంక్షేమమే కూటమి లక్ష్యం: అచ్చెన్న

ఇంటర్నెట్ విభాగం: రైతు సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తున్నదని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ‘‘రాష్ట్రవ్యాప్తంగా 46,85,838 రైతు కుటుంబాలు అన్నదాత సుఖీభవ పథకం ద్వారా లబ్థి పొందాయి. వీరిలో 45,69,817 మంది భూ యజమాని రైతులు, 1,16,021 మంది అటవీహక్కుల చట్టం కింద సాగు చేస్తున్న రైతు కుటుంబాలు ఉన్నాయి. ఎరువుల పంపిణీ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. రాష్ట్రంలో యూరియా, డీఏపీ ఎరువులు పుష్కలంగా అందుబాటులో ఉన్నాయి.’’ అని అచ్చెన్న తెలిపారు.

Updated Date - Jun 21 , 2026 | 04:24 AM