‘బొల్లా’కు జైలుతో మొక్కు తీర్చుకున్న రైతు!
ABN , Publish Date - Jun 19 , 2026 | 04:51 AM
తన శపథం నెరవేరడంతో గురువారం పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలంలోని లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం వరకు ఓ రైతు పాదయాత్ర చేసి మొక్కు తీర్చుకున్నారు.
వైసీపీ హయాంలో రైతుపై చెప్పుతో దాడి, అక్రమ కేసుతో జైలు
శపథం నెరవేరడంతో దేవస్థానం వరకు పాదయాత్ర
వినుకొండటౌన్, జూన్ 18 (ఆంధ్రజ్యోతి): తన శపథం నెరవేరడంతో గురువారం పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలంలోని లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం వరకు ఓ రైతు పాదయాత్ర చేసి మొక్కు తీర్చుకున్నారు. ఈ పాదయాత్రను ప్రభుత్వ చీఫ్‌విప్ జీవీ ఆంజనేయులుతో పాటు డీసీసీబీ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు ప్రారంభించారు. వైసీపీ ప్రభుత్వం హయాంలో వేల్పూరులో జరిగిన ఓ కార్యక్రమంలో పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని ప్రశ్నించిన ఈపూరు మండలం కొండాయపాలేనికి చెందిన రైతు గడిపూడి నరేంద్రపై మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు చెప్పుతో దాడి చేయడంతో పాటు అక్రమ కేసు బనాయించి జైలుకు పంపారు. దీంతో ఆ రైతు.. బొల్లా కూడా జైలుకు వెళ్లే వరకు తాను చెప్పులు వేసుకోనని శపథం చేశాడు. ఇటీవల హైదరాబాద్ భూ కుంభకోణంలో నకిలీ పత్రాలు సృష్టించిన కేసులో బొల్లా జైలుకు వెళ్లడంతో పాదయాత్ర చేస్తున్నట్టు రైతు నరేంద్ర తెలిపాడు.