Share News

అప్పుల బాధతో అన్నదాత ఆత్మహత్య

ABN , Publish Date - Sep 11 , 2026 | 11:24 PM

మండలంలోని కైరుప్పల గ్రామానికి చెందిన కురువ సురకట్టల వెంకటరాముడు(35) అప్పుల బాధతో శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నారు.

   అప్పుల బాధతో అన్నదాత ఆత్మహత్య

ఆస్పరి, సెప్టెంబరు 11(ఆంధ్రజ్యోతి): మండలంలోని కైరుప్పల గ్రామానికి చెందిన కురువ సురకట్టల వెంకటరాముడు(35) అప్పుల బాధతో శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసుల కథనం మేరకు.. వెంకటరాముడు తనకున్న 4 ఎకరాల పొలంలో పత్తి సాగు చేశారు. ఈ ఏడాది తీవ్ర వర్షాభావంతో పత్తి పంట చేతికి రాక ఎండిపోయింది. గత మూడు, నాలుగేళ్లుగా పంటలు పండకపోవడంతో సుమారు రూ.12 లక్షలు దాకా అప్పు చేశారు. బ్యాంకులో రూ.2 లక్షలు, ప్రైవేట్‌ వ్యక్తుల వద్ద రూ.10 లక్షలు అప్పు తీసుకున్నారు. ఈ అప్పు ఎలా తీర్చాలోనని మనస్తాపం చెందేవారు. పొలంలో పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. వెంకటరాముడు భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శ్రీనివాస నాయక్‌ తెలిపారు.

Updated Date - Sep 11 , 2026 | 11:24 PM