నకిలీ మద్యం నిందితుల రిమాండ్ పొడిగింపు
ABN , Publish Date - Feb 06 , 2026 | 03:19 AM
నకిలీ మద్యం తయారీ కేసులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న ఐదుగురు నిందితులకు కోర్టు రిమాండ్‌ను పొడిగించింది. విజయవాడ, నెల్లూరు జైళ్లలో ఉన్న తలారి రంగయ్య...
ఐదుగురికి 19 వరకు పొడిగించిన కోర్టు
విజయవాడ/ములకలచెరువు, ఫిబ్రవరి 5 (ఆంధ్రజ్యోతి): నకిలీ మద్యం తయారీ కేసులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న ఐదుగురు నిందితులకు కోర్టు రిమాండ్‌ను పొడిగించింది. విజయవాడ, నెల్లూరు జైళ్లలో ఉన్న తలారి రంగయ్య (ఏ14), టి.రమే్‌ష(ఏ15), దారబోయిన ప్రసాద్ (ఏ23), జినే్‌ష(ఏ24), షిబు(ఏ24)ను అధికారులు గురువారం వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా విజయవాడ ఆరో అదనపు జ్యుడిషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ న్యాయాధికారి ముందు హాజరుపరిచారు. దీంతో వారికి ఈ నెల 19 వరకు రిమాండ్ పొడిగించారు. నకిలీ మద్యం కేసులో షరతులను ఉల్లంఘించిన మాజీ మంత్రి జోగి రమేష్, అతని తమ్ముడు జోగి రాముల బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై విచారణ శుక్రవారానికి వాయిదా పడింది. దీనిపై విజయవాడ ఎనిమిదో అదనపు జిల్లా కోర్టులో గురువారం విచారణ జరిగింది. కాగా, నకిలీ మద్యం కేసులో మధ్యంతర బెయిల్‌పై బయటకు వచ్చిన నిందితుడు సుదర్శన్ గురువారం కోర్టులో లొంగిపోయాడు. కాగా, ములకలచెరువు నకిలీ మద్యం కేసులో ప్రధాన నిందితుడు అద్దేపల్లి జనార్దనరావు స్నేహితుడు, హైదరాబాద్‌కు చెందిన నకిరికంటి రవి(ఏ16)కి తంబళ్లపల్లె జూనియర్ సివిల్ కోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం కేసులోనూ అతడు నిందితుడిగా ఉండటంతో జైలు నుంచి బయటకు రాలేని పరిస్థితి ఉంది.