శ్రీశైలం లడ్డూలకూ నకిలీ నెయ్యి
ABN , Publish Date - Feb 06 , 2026 | 03:06 AM
తిరుమల తరహాలోనే శ్రీశైలం ప్రసాదం లడ్డూలకూ నకిలీ నెయ్యి సరఫరా అయింది. తిరుమలకు నెయ్యి సరఫరా చేసిన సంస్థే శ్రీశైలానికి కూడా నెయ్యిని సరఫరా చేసిందని సిట్ విచారణలోనే తేలింది...
11 నెలల పాటు 3.25 లక్షల కిలోలు సరఫరా: పట్టాభి
శ్రీశైలం, ఫిబ్రవరి 5(ఆంధ్రజ్యోతి): ‘తిరుమల తరహాలోనే శ్రీశైలం ప్రసాదం లడ్డూలకూ నకిలీ నెయ్యి సరఫరా అయింది. తిరుమలకు నెయ్యి సరఫరా చేసిన సంస్థే శ్రీశైలానికి కూడా నెయ్యిని సరఫరా చేసిందని సిట్ విచారణలోనే తేలింది’ అని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరాం ఆరోపించారు. గురువారం శ్రీశైల భ్రమరాంబికా మల్లికార్జునస్వామి వారిని దర్శించుకున్న ఆయన అనంతరం విలేకరులతో మాట్లాడారు. ‘రాజేష్ కార్పొరేషన్ సంస్థ శ్రీశైలం దేవస్థానానికి 11 నెలలపాటు సుమారు 3,25,064 కిలోల నకిలీ నెయ్యి సరఫరా చేసి రూ.15.89 కోట్ల బిల్లులను తీసుకుంది. ఈ విషయాన్ని సిట్ అధికారుల తమ విచారణలో తేల్చారు. బాధ్యులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది’ అని చెప్పారు.