నకిలీ బిలియర్డ్స్ అసోసియేషన్ పేరుతో వసూళ్లు
ABN , Publish Date - Apr 14 , 2026 | 06:19 AM
నకిలీ అసోసియేషన్ పేరుతో వసూళ్లకు పాల్పడుతున్న ఏపీ బిలియర్డ్స్ అండ్ స్నూకర్ సంఘం వ్యవహారంపై సీనియర్ క్రీడాకారులు, స్వర్ణాంధ్ర క్యూ స్పోర్ట్స్ అసోసియేషన్ ప్రతినిధులు మండిపడ్డారు.
గుర్తింపులేని సంఘం పేరిట టోర్నమెంట్లు నిర్వహణ
క్రీడాకారులు, స్వర్ణాంధ్ర క్యూ స్పోర్ట్స్ సంఘం మండిపాటు
గుంటూరు, ఏప్రిల్ 13 (ఆంధ్రజ్యోతి): నకిలీ అసోసియేషన్ పేరుతో వసూళ్లకు పాల్పడుతున్న ఏపీ బిలియర్డ్స్ అండ్ స్నూకర్ సంఘం వ్యవహారంపై సీనియర్ క్రీడాకారులు, స్వర్ణాంధ్ర క్యూ స్పోర్ట్స్ అసోసియేషన్ ప్రతినిధులు మండిపడ్డారు. దీంతో రాష్ట్రంలో బిలియర్డ్స్ అండ్ స్నూకర్ క్రీడ మనుగడకే ప్రమాదం ఏర్పడిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నకిలీ అసోసియేషన్ వ్యవహారంపై చర్చించేందుకు వారు సోమవారం గుంటూరులో సమావేశమయ్యారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఏపీ బిలియర్డ్స్ అండ్ స్నూకర్ అసోసియేషన్ ఉండేది. విభజన అనంతరం అప్పట్లో ఏపీ బిలియర్డ్స్ అండ్ స్నూకర్ అసోసియేషన్‌ను రంగారెడ్డి జిల్లా రిజిస్ట్రేషన్ రిజిస్టర్ చేశారు. ఆ సంఘాన్ని ఏపీకి బదిలీ చేయడానికి సాంకేతిక సమస్యలు ఎదురవడంతో రాజమండ్రికి చెందిన కె సోమేశ్వరరావు... ఆంధ్రప్రదేశ్ బిలియర్డ్స్ అండ్ స్నూకర్ అసోసియేషన్ లెటర్ హెడ్‌పై కార్యకలాపాలు సాగిస్తున్నారని క్రీడాకారులు, అసోసియేషన్ సభ్యులు ఆరోపించారు. దీనిపై ఇప్పటికే బిలియర్డ్స్ అండ్ స్నూకర్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (బీఎ్‌సఎ్‌ఫఐ)కు ఫిర్యాదు చేశామని వారు తెలిపారు. ఏపీలో ఉన్నది గుర్తింపులేని సంఘం కావడంతో బీఎ్‌సఎ్‌ఫఐ నుంచి ఎటువంటి సహకారం అందడం లేదన్నారు. దీంతో రాష్ట్రంలో బిలియర్డ్స్ అండ్ స్నూకర్ క్రీడ మనుగడకే ప్రమాదం ఏర్పడిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో మరోసారి అన్ని జిల్లాల నుంచి క్రీడాకారులతో సమావేశం ఏర్పాటు చేసి భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తామన్నారు. అలాగే.. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్, క్రీడాశాఖ మంత్రిని కలిసి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. సమావేశంలో బీఎ్‌సఎ్‌ఫఐ, స్వర్ణాంధ్ర క్యూ స్పోర్ట్స్ అసోసియేషన్ ప్రతినిదులు సోమగాని శంకర్, వెల్లంకి సుషీల్ చౌదరి, తదితరులు పాల్గొన్నారు.