Share News

రోడ్డుపై 500 నోట్ల కలకలం!

ABN , Publish Date - Jul 06 , 2026 | 05:25 AM

అది విజయనగరంలోని ఎన్‌సీఎస్‌ జంక్షన్‌ నుంచి పంచముఖేశ్వర ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్లే మార్గం. ఆదివారం ఆ రోడ్డులో ఎక్కడ చూసినా..

రోడ్డుపై 500 నోట్ల కలకలం!

  • ఎగబడిన జనం.. బొమ్మ నోట్లని తేలడంతో నిరుత్సాహం

విజయనగరం, జూలై 5 (ఆంధ్రజ్యోతి): అది విజయనగరంలోని ఎన్‌సీఎస్‌ జంక్షన్‌ నుంచి పంచముఖేశ్వర ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్లే మార్గం. ఆదివారం ఆ రోడ్డులో ఎక్కడ చూసినా 500 నోట్లు కుప్పలుగా పడి ఉన్నాయి. పక్కనే బ్యాంకులు, 4 ఏటీఎంలు ఉండడంతో కొందరు ఆ నోట్ల కోసం ఎగబడ్డారు. తీరా చూస్తే అవి బొమ్మ నోట్లు..! అంతకుముందే ఓ పెళ్లి ఊరేగింపులో ఈ నోట్లు వెదజల్లుతూ వెళ్లారని, అవి నిజమైన నోట్లు కావని తెలుసుకుని అవాక్కయ్యారు.

Updated Date - Jul 06 , 2026 | 05:26 AM