Dagadarthi: దగదర్తి టీడీపీలో వర్గపోరు
ABN , Publish Date - Jan 06 , 2026 | 05:02 AM
నెల్లూరు జిల్లా దగదర్తి మండల కేంద్రంలో టీడీపీ నేతల వర్గపోరులో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు.
ఓ వర్గం దాడిలో క్లస్టర్ ఇన్‌చార్జికి గాయాలు
దగదర్తి(బిట్రగుంట), జనవరి 5(ఆంధ్రజ్యోతి): నెల్లూరు జిల్లా దగదర్తి మండల కేంద్రంలో టీడీపీ నేతల వర్గపోరులో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం రాత్రి జరిగిన దాడి ఘటనలో క్లస్టర్ ఇన్‌చార్జి కడియాల సురేశ్ గాయాలపాలవగా, కావలి వైద్యశాలకు తరలించారు. బాధితుడు సురేశ్ సోమవారం ఘటనపై మీడియాతో మాట్లాడారు. ‘మాలేపాటి కుటుంబీకుల రాజకీయ భవిష్యత్తుకు నేను అడ్డుగా ఉన్నానని, నన్ను శాశ్వతంగా తొలగించాలనే ఉద్దేశంతో మారణాయుధాలతో దాడి చేశారు. మాలేపాటి సుధాకర్ నాయుడు, ఆయన అనుచరులు సుమారు 30 మంది కర్రలు, ఇనుపరాడ్లు, మారణాయుధాలతో దాడికి దిగారు’ అని పేర్కొన్నారు. కావలి రూరల్ సీఐ పాపారావు, స్థానిక ఎస్సై జంపాని కుమార్ పోలీసులతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇరువర్గాల వారికి నచ్చచెప్పడంతో వివాదం సద్దుమణిగింది.