Share News

రూ.7 కోట్ల స్థలంపై కన్ను

ABN , Publish Date - Feb 16 , 2026 | 01:00 AM

కబ్జాదారులకు అజితసింగ్‌నగర్‌, న్యూ రాజరాజేశ్వరిపేట కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది. సర్వే నెంబర్లు మార్చి ఇరిగేషన్‌ స్థలాలను కొట్టేయడం ఇక్కడ పరిపాటిగా మారింది. గత వైసీపీ ప్రభుత్వంలో ఇరిగేషన్‌, అసైన్డ్‌, కామన్‌ తదితర ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసేందుకు వైసీపీ నేతలు వేసిన ఎత్తులు అన్ని ఇన్ని కావు. ఎప్పటికప్పుడు ‘ఆంధ్రజ్యోతి’ కబ్జా స్థలాలపై కథనాలు ప్రచురించడంతో స్పందించిన అధికారులు ప్రభుత్వ స్థలాలు అన్యాక్రాంతం కాకుండా చర్యలు చేపట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా వారి తీరు మారటం లేదు.

రూ.7 కోట్ల స్థలంపై కన్ను

- 1.57 ఎకరాల ఇరిగేషన్‌ స్థలం కబ్జాకు యత్నం

- అజితసింగ్‌ నగర్‌, న్యూ రాజరాజేశ్వరిపేటలో వ్యవహారం

- కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన స్థానికుడు

- 40 రోజులు అవుతున్నా పట్టించుకోని అధికారులు

- విమర్శలు వ్యక్తం చేస్తున్న స్థానికులు

కబ్జాదారులకు అజితసింగ్‌నగర్‌, న్యూ రాజరాజేశ్వరిపేట కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది. సర్వే నెంబర్లు మార్చి ఇరిగేషన్‌ స్థలాలను కొట్టేయడం ఇక్కడ పరిపాటిగా మారింది. గత వైసీపీ ప్రభుత్వంలో ఇరిగేషన్‌, అసైన్డ్‌, కామన్‌ తదితర ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసేందుకు వైసీపీ నేతలు వేసిన ఎత్తులు అన్ని ఇన్ని కావు. ఎప్పటికప్పుడు ‘ఆంధ్రజ్యోతి’ కబ్జా స్థలాలపై కథనాలు ప్రచురించడంతో స్పందించిన అధికారులు ప్రభుత్వ స్థలాలు అన్యాక్రాంతం కాకుండా చర్యలు చేపట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా వారి తీరు మారటం లేదు.

(ఆంధ్రజ్యోతి, అజితసింగ్‌నగర్‌):

నగరంలోని అజితసింగ్‌ నగర్‌, న్యూ రాజరాజేశ్వరిపేట నుంచి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు వెళ్లే మార్గ మధ్యంలో బుడమేరు ప్రవహిస్తూ ఉంది. గత వైసీపీ ప్రభుత్వం బుడమేరుపై వంతెనను కూడా నిర్మించింది. ఇరిగేషన్‌ స్థలం పక్కనే ఉన్న ప్రైవేట్‌ స్థలాన్ని చూపించి అక్రమార్కులు ఇరిగేషన్‌ స్థలాన్ని కూడా కలుపుకుని ప్లాట్లుగా విభజించి అమ్మకాలు జరపాలని ప్రయత్నిస్తున్నారు. ఇంత బహిరంగంగా ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నించడాన్ని గమనించిన స్థానికుడు డిసెంబరు 22న స్పందనలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాడు. అక్రమార్కులు సొంతం చేసుకోవడానికి ప్రయత్నించిన స్థలం విలువ రూ.7 కోట్లుపైనే ఉంటుంది. బుడమేరు సరిహద్దులో ఉన్న ఈ స్థలాన్ని ఆక్రమిస్తే ఎవరురారన్న ఉద్దేశ్యంతో కబ్జాకు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. స్థానికంగా ఎకరం రూ.5 కోట్లు వరకు పలుకుతుంది.

సర్వే నెంబర్లు మార్చి..

స్థానికంగా బుడమేరు సరిహద్దులో 1.57 ఎకరాల ఇరిగేషన్‌ స్థలం ఉంది. 86 సర్వే నెంబరులో ఉన్న ఇరిగేషన్‌ స్థలానికి సర్వే నెంబరు 87/2గా మార్చి ప్లాట్లుగా విభజించి అమ్మకాలకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

కఠిన చర్యలు తీసుకోకే..

ఇరిగేషన్‌ కబ్జా వ్యవహారాలపై గత డిసెంబరు 22న స్పందనలో స్థానికులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు చర్యలు తీసుకోకపోవడంతోనే అక్రమార్కులు మరింత రెచ్చిపోతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. అధికారులు అక్రమార్కులకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారనే ఆరోప ణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి కబ్జాదారులపై చర్యలు తీసుకోకపోతే మున్ముందు ప్రభుత్వ స్థలాలు కనుమరుగు కావడం ఖాయమని చెబుతున్నారు.

సర్వే రిపోర్టు ఇంకా రాలేదు

న్యూ రాజరాజేశ్వరిపేటలో ఇరిగేషన్‌ స్థలం కబ్జా వ్యవహారంపై వచ్చిన ఫిర్యాదు మేరకు ఉన్నతాధికారులు రెవెన్యూ శాఖను సర్వే రిపోర్టు కోరారు. రెవెన్యూశాఖ నుంచి ఇంకా సర్వే రిపోర్టు రాలేదు. వచ్చిన తర్వాత పరిశీలించి చర్యలు తీసుకుంటాం.

-రాజశేఖర్‌, ఇరిగేషన్‌ ఏఈ

Updated Date - Feb 16 , 2026 | 01:00 AM