Share News

ఫ్రీ హోల్డ్‌ భూములపై నిషేధం పొడిగింపు!

ABN , Publish Date - Mar 11 , 2026 | 05:12 AM

పలు రకాల భూముల ఫ్రీ హోల్డ్‌, వాటి రిజిస్ట్రేషన్లపై అమల్లో ఉన్న నిషేధాన్ని మరో నెలరోజులు పొడిగిస్తూ రెవెన్యూశాఖ నిర్ణయం తీసుకుంది.

ఫ్రీ హోల్డ్‌ భూములపై నిషేధం పొడిగింపు!

అమరావతి, మార్చి 10(ఆంధ్రజ్యోతి): పలు రకాల భూముల ఫ్రీ హోల్డ్‌, వాటి రిజిస్ట్రేషన్లపై అమల్లో ఉన్న నిషేధాన్ని మరో నెలరోజులు పొడిగిస్తూ రెవెన్యూశాఖ నిర్ణయం తీసుకుంది. ఏపీ అసైన్డ్‌ భూముల చట్టం-1977(పీఓటీ) ప్రకారం అసైన్‌మెంట్‌ జరిగి 20 ఏళ్ల కాలపరిమితిదాటిన భూములను నిబంధనల ప్రకారం నిషేధ జాబితా 22(ఏ) నుంచి తొలగించి శాశ్వత హక్కులు కల్పిస్తూ 2023లో చట్టం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం అర్హత ఉన్న భూములను 22(ఏ) నుంచి తొలగించి ఫ్రీ హోల్డ్‌ చేయాలి. అయితే, ఈ ప్రక్రియలో భారీగా అక్రమాలు జరిగాయని కూటమి సర్కారు 2024 ఆగస్టులో భూముల ఫ్రీ హోల్డ్‌ను నిలిపివేసింది. రిజిస్ట్రేషన్లపై నిషేధం విధించింది. ఈ సమస్య పరిష్కారం కోసం రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ నేతృత్వాన మంత్రివర్గ ఉపసంఘాన్ని కూడా ఏర్పాటు చేసింది. మరోవైపు ఫ్రీ హోల్డ్‌ భూముల అక్రమాలపై విచారణ కూడా పూర్తికావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఫ్రీ హోల్డ్‌ భూములపై నిషేధాన్ని మరో నెలరోజులు పొడిగిస్తూ రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్‌ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.

Updated Date - Mar 11 , 2026 | 05:12 AM