పంట బీమా గడువు పొడిగించండి
ABN , Publish Date - Jul 15 , 2026 | 12:02 AM
రైతుల అభ్యర్థనల మేరకు పంట బీమా నమోదు గడువును పొడిగించాలని ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి ఫోన ద్వారా కలెక్టర్ సిరికి విన్నవించా రు.
- కలెక్టర్‌కు ఆదోని ఎమ్మెల్యే ఫోన...
- ఆరేకల్‌లో పంటల పరిశీలన
ఆదోని రూరల్, జూలై 14 (ఆంధ్రజ్యోతి) : రైతుల అభ్యర్థనల మేరకు పంట బీమా నమోదు గడువును పొడిగించాలని ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారఽథి ఫోన ద్వారా కలెక్టర్ సిరికి విన్నవించా రు. మంగళవారం వ్యవసాయ అధికారి సుధాకర్‌తో కలిసి ఆరేక ల్‌లో రైతుల పంట పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు తమ బాధను ఎమ్మెల్యేకు చెప్పుకున్నారు. నేషనల్ క్రాప్ ఇ న్సూరెన్స పోర్టల్, వాతావరణ ఆధారిత పంట బీమా పోర్టల్ నేటితో ముగియనుందని, దీంతో తాము వేసిన పంటలకు బీమా చేయిం చుకుందామంటే ఇబ్బందికరంగా మారుతుందని రైతులు మూ కుమ్మడిగా ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. ఈ ఏడాది ఏల్‌నినో ప్రభా వం వలన వర్షాలు పడే అవకాశం తక్కువగా ఉందని, కావున రైతు లందరూ తప్పనిసరిగా పంటలకు బీమా చేయించుకోవాలన్నారు.