రక్తహీనత నివారణకు ఖరీదైన ఇంజెక్షన్లు
ABN , Publish Date - Feb 08 , 2026 | 11:19 PM
రక్తహీనతతో బాధపడుతున్న గర్భిణులకు, బాలింతలకు కూటమి ప్రభు త్వం ఖరీదైన ఇంజెక్షన్లను ఉచితంగా అందిస్తున్నట్లు ఎమ్మెల్యే పార్థసారధి అన్నారు.
ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది
ఆదోని ఎమ్మెల్యే పార్థసారధి
ఆదోని, ఫిబ్రవరి 8 (ఆంధ్రజ్యోతి): రక్తహీనతతో బాధపడుతున్న గర్భిణులకు, బాలింతలకు కూటమి ప్రభు త్వం ఖరీదైన ఇంజెక్షన్లను ఉచితంగా అందిస్తున్నట్లు ఎమ్మెల్యే పార్థసారధి అన్నారు. ఆదివారం ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడారు. గ్రామీణ, ప ట్టణ ప్రాంతాల్లోని గర్భిణులు, బాలింతలు ఎదుర్కొంటున్న ప్రధాన సమ స్య రక్తహీనత అన్నారు. బయట మార్కెట్‌లో దాదాపు రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు ధర పలికే ఫెర్రిక్ కార్బాక్సిమాల్టోస్ ఇంజెక్షన్లను పీహెచసీలో, కమ్యూనిటీ సెంటర్లు, ఏరియా ఆసుపత్రుల్లో ఉచింగా ఇస్తున్నారన్నారు. ప్రభుత్వ తాజా నిర్ణయం మాతా శిశు మరణాల రేటును తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ఈ అవకాశాన్ని రక్తహీనతతో బాధపడుతున్న మహిళలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.