త్వరితగతిన ఎంఎస్ఎంఈల ఏర్పాటు : సీఎస్
ABN , Publish Date - Jan 09 , 2026 | 04:15 AM
రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ఒక ఎంఎ్‌సఎంఈ పార్కును త్వరితగతిన అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఆదేశించారు.
అమరావతి, జనవరి 8(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ఒక ఎంఎ్‌సఎంఈ పార్కును త్వరితగతిన అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఆదేశించారు. గురువారం అమరావతి సచివాలయం నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. మూడు దశల్లో 175 పార్కులను ఏర్పాటు చేస్తున్నామన్నారు. మొదటి దశలో 55 ఏర్పాటు చేయాల్సి ఉండగా.. ఇప్పటికే 16 ప్రారంభం అయ్యాయని, మరో 39 పార్కులకు శంకుస్థాపన చేశామని తెలిపారు. విశాఖ భాగస్వామ్య సదస్సు-2025లో వివిధ కంపెనీలతో చేసుకున్న అవగాహనా ఒప్పందాలకు సంబంధించిన ప్రాజెక్టులను గ్రౌండింగ్ చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. వాణిజ్యశాఖ కార్యదర్శి యువరాజ్ జిల్లాల వారీగా ఎంఎస్ఎంఈ పార్కుల ప్రగతిని వివరించారు.