విడదల రజిని పాస్‌పోర్టు సరెండర్
ABN , Publish Date - May 18 , 2026 | 05:07 AM
హైకోర్టు ఆదేశాల మేరకు మాజీ మంత్రి, వైసీపీ నాయకురాలు విడదల రజిని ఆదివారం నరసరావుపేట డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ హనుమంతరావుకు..
నరసరావుపేట లీగల్, మే 17 (ఆంధ్రజ్యోతి): హైకోర్టు ఆదేశాల మేరకు మాజీ మంత్రి, వైసీపీ నాయకురాలు విడదల రజిని ఆదివారం నరసరావుపేట డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ హనుమంతరావుకు తన పాస్‌పోర్టును సరెండర్ చేశారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటకు చెందిన పిల్లి కోటి అనే టీడీపీ నేత ఫిర్యాదుతో రజినితో పాటు మరికొందరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. సదరు కేసు బెయిల్ విచారణ సమయంలో.. హైకోర్టు విధించిన ఆంక్షల మేరకు ఆమె తన పాస్‌పోర్టు పోలీసులకు సరెండర్ చేశారు.