Fake Liquor Case: రాజేశ్, అన్బురసులను కస్టడీకి ఇవ్వండి
ABN , Publish Date - Jan 18 , 2026 | 05:34 AM
ములకలచెరువు నకిలీ మద్యం కేసు నిందితులు, మదనపల్లె సబ్‌జైల్లో ఉన్న రాజే్‌ష(ఏ5), అన్బురసు అలియాస్ బాబు...
తంబళ్లపల్లె కోర్టులో ఎక్సైజ్ పోలీసుల పిటిషన్
ములకలచెరువు, జనవరి 17(ఆంధ్రజ్యోతి): ములకలచెరువు నకిలీ మద్యం కేసు నిందితులు, మదనపల్లె సబ్‌జైల్లో ఉన్న రాజే్‌ష(ఏ5), అన్బురసు అలియాస్ బాబు(ఏ19)ను కస్టడీకి కోరుతూ ఎక్సైజ్ పోలీసులు తంబళ్లపల్లె కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తంబళ్లపల్లె టీడీపీ ఇన్‌చార్జిగా ఉంటూ సస్పెండైన దాసరిపల్లి జయచంద్రారెడ్డి పీఏగా పనిచేసిన రాజేష్‌ను గతనెల 9న, అలాగే జయచంద్రారెడ్డి ఇంట్లో పని చేసిన అన్బురసును గతనెల 10న అరెస్టు చేశారు. ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్న వీరిద్దరినీ విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలని పిటిషన్‌లో కోరారు. ఈ పిటిషన్ సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉందని ఎక్సైజ్ పోలీసులు తెలిపారు. ఇదే కేసులో నిందితుడైన సెంధిల్(ఏ30)ను ఇటీవల తమిళనాడులోని కోయంబత్తూర్‌లో ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేసి తంబళ్లపల్లె కోర్టులో హాజరు పరిచారు. సెంధిల్ ప్రస్తుతం మదనపల్లె సబ్‌జైలులో ఉన్నాడు.