Share News

లాటరీ తీయని బార్ల ఫీజు వెనక్కి

ABN , Publish Date - Mar 14 , 2026 | 03:57 AM

నాలుగు దరఖాస్తులు రాకపోవడంతో లాటరీ నిర్వహించని బార్లకు దరఖాస్తు రుసుములు వెనక్కి ఇచ్చేలా బార్‌ పాలసీ రూల్స్‌కు సవరణలు చేస్తూ ఎక్సైజ్‌ శాఖ...

లాటరీ తీయని బార్ల ఫీజు వెనక్కి

అమరావతి, మార్చి 13(ఆంధ్రజ్యోతి): నాలుగు దరఖాస్తులు రాకపోవడంతో లాటరీ నిర్వహించని బార్లకు దరఖాస్తు రుసుములు వెనక్కి ఇచ్చేలా బార్‌ పాలసీ రూల్స్‌కు సవరణలు చేస్తూ ఎక్సైజ్‌ శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ ఏడాది ప్రవేశపెట్టిన బార్‌ పాలసీలో ఒక బార్‌కు కనీసం 4దరఖాస్తులు వస్తేనే లాటరీ తీయాలనే నిబంధన పెట్టారు. 3లోపు వస్తే ఆ ఫీజులు ఏంచేస్తారో స్పష్టత ఇవ్వలేదు. ఈ అంశంపై అప్పట్లోనే ‘ఆంధ్రజ్యోతి’ కథనం ప్రచురించగా... స్పందించిన ఎక్సైజ్‌ శాఖ తాజాగా రీఫండ్‌ చేస్తామని సవరణలు చేసింది.

Updated Date - Mar 14 , 2026 | 03:57 AM