ప్రతి సమస్యను పరిష్కరించాలి
ABN , Publish Date - Jan 28 , 2026 | 12:05 AM
ప్రజా సమస్యల పరిష్కార వేధికలో వచ్చిన ప్రతి సమస్యను ఆయా శాఖల అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించి ప్రజలకు న్యాయం చేయాలని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్తా జయసూర్య అధికారులను ఆదేశించారు.
ఎమ్మెల్యే గిత్తా జయసూర్య
‘ప్రజా సమస్యల పరిష్కార
వేదిక’లో అర్జీల స్వీకరణ
కొత్తపల్లి, జనవరి 27 (ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యల పరిష్కార వేధికలో వచ్చిన ప్రతి సమస్యను ఆయా శాఖల అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించి ప్రజలకు న్యాయం చేయాలని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్తా జయసూర్య అధికారులను ఆదేశించారు. మంగళవారం కొత్తపల్లి ఎంపీడీవో కార్యాలయ సమావేశ భవనంలో తహసీల్దార్ ఉమారాణి అధ్యక్షతన ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. వివిధ సమస్యలపై 23మంది బాధితులు అర్జీలను అందించారు. వీటిని త్వరితగతిన పరిష్కరించాలని ఎమ్మెల్యే సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మండలంలో అధికంగా రెవెన్యూ సమస్యలపై ఫిర్యాదులు వస్తున్నాయని, వీటిని తప్పనిసరిగా పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. మండలంలో సుమారు ఏడువేల గృహాలు పలు దశల్లో అసంపూర్తిగా ఉన్నాయని, వాటిని త్వరితగతిన లబ్ధిదారులు పూర్తి చేసుకోవాలని తెలిపారు. కొత్తమాడుగుల నుంచి తొమ్మిది గ్రామాలకు శుద్ధజలాలు అందించేందుకు ప్రతిపాదనలు పంపించామని తెలిపారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన చెక్కులను బాధితులకు పంపిణీ చేశారు. సమావేశంలో ఈవోఆర్‌డీ సుబ్బారావు, డిప్యూటీ ఎంపీడీవో శర్మ, ఏపీవో విమలమ్మ, పీఆర్ ఏఈ మద్దిలేటి, వైద్యాధికారి విజయేంద్రతో పాటు ఆయాశాఖల అధికారులు, పాల్గొన్నారు.
టీడీపీతోనే గ్రామాలు అభివృద్ధి
టీడీపీ ప్రభుత్వంలోనే గ్రామాలు అభివృద్ధి చెందాయని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్తా జయసూర్య అన్నారు. మంగళవారం కొత్తపల్లిలో టీడీపీ మండల కన్వీనర్ లింగస్వామి గౌడు అధ్యక్షతన నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏ రాజకీయ పార్టీకైనా కార్యకర్తలు మూల స్తంభాలాంటివరన్నారు. కార్యకర్తలకు అండగా నిలువకపోతే మనుగడ సాధించలేమన్నారు. టీడీపీ ప్రభుత్వం కార్యకర్తల సంక్షేమానికి ఎంతో కృషి చేస్తోందన్నారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. కార్యక్రమంలో క్లస్టర్ ఇనచార్జి నారపురెడ్డి, నాగంపల్లి సొసైటీ చైర్మన నాగేశ్వరరావు యాదవ్, టీడీపీ నాయకులు చంద్రశేఖర్ రెడ్డి, రామిరెడ్డి, మోహన యాదవ్, జహరుల్లా, శివారెడ్డి, సహదేవుడు, రాధాకృష్ణారెడ్డి, రామిరెడ్డి, చంద్రారెడ్డి, సుధాకర్, అమర్‌తో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు.