ప్రతి సమస్య పరిష్కరించాలి
ABN , Publish Date - Jan 23 , 2026 | 11:45 PM
ప్రజాసమస్యల పరిష్కారవేదికలో వచ్చిన ప్రతి సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యే జయసూర్య అన్నారు.
జూపాడుబంగ్లా, జనవరి 23 (ఆంధ్రజ్యోతి): ప్రజాసమస్యల పరిష్కారవేదికలో వచ్చిన ప్రతి సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యే జయసూర్య అన్నారు. శుక్రవారం తహసీల్దార్ కార్యాలయం వద్ద ఏర్పాటుచేసిన ప్రజాసమస్యల పరిష్కార వేదిక ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే పాల్గొని సమస్యల కూడిన వినతులను ప్రజల నుంచి స్వీకరించారు. రీసర్వే సందర్భంగా కొన్ని సమస్యలు వస్తున్నాయని వీటిన్నంటిని ప్రభుత్వం పరిష్కరించి రాజముద్రతో కూడిన పట్టాదారు పాసుపుస్తకం అందిస్తామని అన్నారు. నారాలోకేశ జన్మదినం సందర్భంగా జూపాడుబంగ్లాలోని నీలిపల్లెపేటలో విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు ఎమ్మెల్యే అందజేశారు. తహసీల్దార్ చంద్రశేఖర్‌నాయక్, ఎంపీడీవో గోపికృష్ణ్దఎంఈవో చిన్నమద్దిలేటి పాల్గొన్నారు.
కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలి
టీడీపీ కార్యకర్తలు పార్టీఅభివృద్ధికోసం సైనికుల్లా పనిచేయాలని ఎమ్మెల్యే జయసూర్య కార్యకర్తలు, నాయకులకు పిలుపునిచ్చారు. జూపాడుబంగ్లాలో శుక్రవారం కార్యకర్తల సమావేశం మండల కన్వీనర్ మోహనరెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీలో పనిచేసి పార్టీ అభివృద్దికి పాటుపడిన వారికే పార్టీ పదవులు దక్కుతాయని అన్నారు. రానున్న స్థానిక సంస్థలు, సర్పంచ ఎన్నికల్లో టీడీపీ పార్టీ సత్తాచూపించి పార్టీ ఓటింగ్‌శాతం పెరుగేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. టీడీపీ మండల కన్వీనర్ మోహానరెడ్డి, యాదవకార్పొరేషన డైరెక్టర్ వెంకటేశ్వర్లుయాదవ్, సొసైటీ చైర్మన శ్రీనివాసులు, కేసీకాల్వ చైర్మన పరమేశ్వరరెడ్డి, పార్టీ జిల్లా ఉపాధ్యక్షురాలు ప్రసన్నలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.