Share News

ప్రత్యేక వార్డు ఏర్పాటు చేయండి: డీసీహెచఎస్‌

ABN , Publish Date - Apr 25 , 2026 | 11:49 PM

వ డదెబ్బ తగిలిన రోగు ల కు ప్రత్యేక వార్డు ఏర్పా టుచేసి చికిత్స చేయా లని జిల్లా ఆస్పత్రి సేవ ల సమన్వయకర్త (డీసీ హెచఎస్‌) జఫ్రుల్లా వైద్యు లకు సూచించారు.

ప్రత్యేక వార్డు ఏర్పాటు చేయండి: డీసీహెచఎస్‌
ఆసుపత్రిని తనిఖీ చేస్తున్న డీసీహెచఎస్‌ జప్రుల్లా

వెల్దుర్తి, ఏప్రిల్‌ 25(ఆంధ్రజ్యోతి): వ డదెబ్బ తగిలిన రోగు ల కు ప్రత్యేక వార్డు ఏర్పా టుచేసి చికిత్స చేయా లని జిల్లా ఆస్పత్రి సేవ ల సమన్వయకర్త (డీసీ హెచఎస్‌) జఫ్రుల్లా వైద్యు లకు సూచించారు. శనివా రం వెల్దుర్తి సామాజిక ఆ రోగ్య కేంద్రాన్ని (సీహెచసీ) ఆయన తనిఖీ చేశారు. అత్యవసర చికి త్స వార్డు, రక్తపరీక్షల ల్యాబ్‌, ఫార్మసీ, ఎక్స్‌రే, సిబ్బంది పనితీరు, పా రిశుధ్య నిర్వహణ తదితర వాటిని పరిశీలించారు. వైద్యుల, వైద్య సిబ్బంది హాజరు, ఆస్పత్రి రికార్డులను తనిఖీ చేశారు. ఆయన మా ట్లాడుతూ ఆస్పత్రిలో మందుల కొరత లేదని, అయితే సాధారణ ప్రసవాలు, అలాగే అడ్మిషన్లు పెరగాలన్నారు. ఆస్పత్రికి వచ్చే రోగులు ఆధార్‌ కార్డు, సెల్‌ నెంబరుతో ‘ఆయుష్మాన భారత హెల్త్‌ అకౌంట్‌’ (ఆబా) చేసుకోవాలన్నారు. వైద్య సేవలపై రోగులను అడిగి తెలుసు కొని సంతృప్తి వ్యక్తం చేశారు. సూపరింటెండెంట్‌ బాలచంద్రారెడ్డి, వైద్యులు రాజశేఖర్‌, వరప్రసాదు, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Apr 25 , 2026 | 11:49 PM