Share News

‘భీముడు’ దొరికాడు కోయంబత్తూరులో అరెస్టు

ABN , Publish Date - Jun 11 , 2026 | 05:28 AM

గుంటూరులోని జీజీహెచ్‌ నుంచి పరారైన సైబర్‌ మోసగాడు భీముడు అజయ్‌కుమార్‌ ఎట్టకేలకు పోలీసులకు దొరికిపోయాడు. ఓఎల్‌ఎక్స్‌ ద్వారా సైబర్‌ నేరాలు చేయడంలో..

‘భీముడు’ దొరికాడు కోయంబత్తూరులో అరెస్టు

  • సంచలన రీతిలో ఆస్పత్రి నుంచి తప్పించుకొన్న రిమాండ్‌ ఖైదీ

  • ఓఎల్‌ఎక్స్‌ ద్వారా సైబర్‌ నేరాలు.. పలుమార్లు జైలుకు...

  • ఇవే మోసాలు చేస్తూ తమిళనాడులో అరెస్టు

గుంటూరు, జూన్‌ 10 (ఆంధ్రజ్యోతి) : గుంటూరులోని జీజీహెచ్‌ నుంచి పరారైన సైబర్‌ మోసగాడు భీముడు అజయ్‌కుమార్‌ ఎట్టకేలకు పోలీసులకు దొరికిపోయాడు. ఓఎల్‌ఎక్స్‌ ద్వారా సైబర్‌ నేరాలు చేయడంలో ఆరితేరిని అజయ్‌కుమార్‌ ఇదే తరహాలో తమిళనాడులోని కోయంబత్తూరులోనూ మోసాలకు పాల్పడుతూ అక్కడి పోలీసులకు పట్టుబడ్డాడు. రిమాండ్‌ ఖైదీగా ఉన్న భీముడు ఈ ఏడాది మార్చి 28న గుంటూరు ప్రభుత్వాస్పత్రి నుంచి పోలీసుల కళ్లుగప్పి పరారైన విషయం తెలిసిందే. పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడి నిందితుడి కోసం ఏపీతో పాటు, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలో గాలించినా ఆచూకీ లభించలేదు. టెక్నాలజీపై పట్టున్న అజయ్‌కుమార్‌ పాత సెల్‌ఫోన్‌లు పక్కన పడేసి పోలీసులకు క్లూ దొరక్కుండా వారికి సవాల్‌గా మారాడు. ఈ నేపథ్యంలో తమిళనాడులో మకాం వేసిన అజయ్‌కుమార్‌ అక్కడ తిరిగి ఏఎల్‌ఎక్స్‌ మోసాలకు తెరతీశాడు. అతడిని కోయంబత్తూరు పోలీసులు అరెస్ట్‌ చేసి జైలుకు పంపారు. ఆ సమాచారం గుంటూరు సహా ఏపీలోని పలు జిల్లాల్లోని పోలీ్‌సస్టేషన్లకు సమాచారం అందించారు. అప్రమత్తమైన గుంటూరు కొత్తపేట సీఐ వీరయ్య చౌదరి ఓ బృందాన్ని కోయంబత్తూరు పంపారు. ఏలూరు జిల్లా పెదవేగి మండలం కొప్పులవారిగూడెం శివారు నాగన్నగూడెం గ్రామానికి చెందిన భీముడు అజయ్‌ కుమార్‌పై తెనాలి వన్‌టౌన్‌ పోలీస్‌ ేస్టషన్‌లో గతేడాది చీటింగ్‌ కేసు నమోదైన విషయం తెలిసిందే.

Updated Date - Jun 11 , 2026 | 05:29 AM