పర్యావరణాన్ని పరిరక్షించాలి
ABN , Publish Date - Jun 05 , 2026 | 05:48 AM
ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించండి. ప్రకృతిని కాపాడండి. గ్లోబల్ వార్మింగ్‌ను నియంత్రించండి... ఈ నినాదాలతో రూపొందించిన సైకత శిల్పం ఆకట్టుకుంటోంది.
రంగంపేట, జూన్ 4(ఆంధ్రజ్యోతి): ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించండి. ప్రకృతిని కాపాడండి. గ్లోబల్ వార్మింగ్‌ను నియంత్రించండి... ఈ నినాదాలతో రూపొందించిన సైకత శిల్పం ఆకట్టుకుంటోంది. పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు దీనిని రూపొందించారు. శుక్రవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా రంగంపేటకు చెందిన ప్రముఖ సైకతశిల్పి దేవిన శ్రీనివాస్ కుమార్తెలు దేవిన సోహిత, ధన్యతలు గురువారం ఈ సైకత శిల్పం రూపొందించారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని, పెరుగుతున్న కాలుష్యం, వాతావరణ మార్పులు, గ్లోబల్ వార్మింగ్ వంటి సమస్యల నేపథ్యంలో మొక్కల ప్రాముఖ్యతను చాటి చెప్పేలా మొక్క నాటుతున్న దృశ్యాన్ని శిల్పంలో ప్రతిబింబించారు.