గడువు ముంచుకొస్తోంది
ABN , Publish Date - Jul 13 , 2026 | 03:29 AM
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) ప్రక్రియలో ఇంటింటి సర్వే కార్యక్రమం తుది అంకానికి చేరుకుంది. ఓటరు ఎన్యుమరేషన్ ఫారాల సమర్పణ గడువు..
రేపటితో ముగియనున్న ‘సర్’ ఫారాల స్వీకరణ
రాష్ట్రంలో 4.16 కోట్ల ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ
భర్తీ చేసిన 3.88 కోట్ల ఫారాల డిజిటలైజేషన్ పూర్తి
అమరావతి, జూలై 12(ఆంధ్రజ్యోతి): ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) ప్రక్రియలో ఇంటింటి సర్వే కార్యక్రమం తుది అంకానికి చేరుకుంది. ఓటరు ఎన్యుమరేషన్ ఫారాల సమర్పణ గడువు మంగళవారం(ఈనెల 14)తో ముగియనుంది. ఇప్పటికీ ఎన్యుమరేషన్ ఫారం సమర్పించని ఓటర్లు తమ బూత్ లెవెల్ అధికారిని(బీఎల్‌వో) వెంటనే సంప్రదించి ఎన్యుమరేషన్ ఫారం అందజేయాలి, లేదంటే ముసాయిదా ఓటర్ల జాబితాలో ఓటు గల్లంతవుతుంది. రాష్ట్రంలో మొత్తం 4,16,27,694 మంది ఓటర్లు ఉండగా 4,16,20,565 మందికి(99.98 శాతం) ఎన్యురేషన్ ఫారాల(ఈఎఫ్)ను పంపిణీ చేశారు. వాటిలో ఓటర్లు తమ వివరాలు నింపి, తిరిగి బీఎల్‌వోలకు సమర్పించగా.. అందులో 3,88,34,360 ఫారాల(93.29 శాతం)ను డిజిటలైజ్ చేసినట్లు ఆదివారం విడుదల చేసిన బులెటెన్‌లో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ తెలిపారు.