Share News

నేడే చివరి రోజు ‘సర్‌’

ABN , Publish Date - Jul 24 , 2026 | 05:06 AM

ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (సర్‌)లో భాగంగా ఓటర్‌ ఎన్యుమరేషన్‌ ఫారాల స్వీకరణ, డిజిటలైజేషన్‌ గడువు శుక్రవారంతో ముగియనుంది.

నేడే చివరి రోజు ‘సర్‌’

  • ఎన్యుమరేషన్‌ ఫారాల స్వీకరణ నేటితో ఆఖరు

  • బీఎల్‌వోలకు తిరిగి ఇవ్వకుంటే ఓటర్ల జాబితాలో పేరుండదు!

అమరావతి, జూలై 23 (ఆంధ్రజ్యోతి): ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (సర్‌)లో భాగంగా ఓటర్‌ ఎన్యుమరేషన్‌ ఫారాల స్వీకరణ, డిజిటలైజేషన్‌ గడువు శుక్రవారంతో ముగియనుంది. ఇప్పటికే 100 శాతం ఎన్యుమరేషన్‌ ఫారాల పంపిణీ, స్వీకరణ, డిజిటలైజేషన్‌ పూర్తయినట్లు ఎన్నికల సంఘం తెలిపింది. అయితే ఆ డిజిటలైజ్‌ అయిన ఫారాల్లోనే 43 లక్షల అన్‌కలెక్టబుల్‌ ఫారాలు ఉన్నాయి. బీఎల్‌వోల వద్ద ఎన్యుమరేషన్‌ ఫారం తీసుకుని తిరిగి వారికి అప్పగించకపోయినా.. ఆన్‌లైన్‌లో డిజిటలైజ్‌ చేయకపోయినా ఈ నెల 31న ప్రకటించే ఓటర్ల జాబితాలో పేరు ఉండే అవకాశం లేదు.

Updated Date - Jul 24 , 2026 | 05:07 AM