Share News

కానిస్టేబుల్‌ పై కేసు నమోదు

ABN , Publish Date - Mar 14 , 2026 | 11:39 PM

సివిల్‌ వివాదాల్లో తలదూర్చడమే కాకుండా దౌర్జన్యానికి పాల్పడిన ఒక పోలీసు కానిస్టేబుల్‌తో పాటు మరో ఐదుగురిపై ఆదోని త్రీటౌన్‌ పోలీసులు బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

   కానిస్టేబుల్‌ పై కేసు నమోదు

ఆదోని, మార్చి 14 (ఆంధ్రజ్యోతి): సివిల్‌ వివాదాల్లో తలదూర్చడమే కాకుండా దౌర్జన్యానికి పాల్పడిన ఒక పోలీసు కానిస్టేబుల్‌తో పాటు మరో ఐదుగురిపై ఆదోని త్రీటౌన్‌ పోలీసులు బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. వివరాలు.. పట్టణంలోని ఏపీహెచ్‌బీ కాలనీకి చెందిన వ్యాపారి కె.రాఘవేంద్ర, తన భాగస్వాములతో కలిసి ఆదోని లోని సర్వే నెంబర్‌ 159/2బీ2, 159/2బీ1 పరిధిలో 4.21 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. ’గార్డెనియా విల్లాస్‌’ పేరుతో లే అవుట్‌ అభివృద్ధి చేసి చుట్టూ ప్రహరీని నిర్మించి నిర్మాణ పనులు చేపట్టారు. పక్కనే భూమి ఉన్న రామకృష్ణ అనే కానిస్టేబుల్‌ నెల రోజు లుగా పనులకు ఆటంకం కలిగిస్తూ కార్మికులను భయబ్రాంతులకు గురిచేస్తున్నాడు. శుక్రవారం రామకృష్ణతో పాటు ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ వెంకటేశ్వర్లు, జగన్నాథ్‌, నరేష్‌, రవి, బసవ అనే వ్యక్తులతో కలిసి ప్లాట్‌ నంబర్‌ 1, 2లోకి అక్రమంగా ప్రవేశించారు. అక్కడ ఉన్న ప్రహరీని కూల్చివేశారు. సుమారు రూ.2లక్షలు విలువైన నిర్మాణ సామగ్రిని (మెటీరియల్‌) దొంగి లించి తన సొంత స్థలంలో ఫ్లోరింగ్‌ కోసం తరలించుకుపోయినట్లు ఫిర్యా దులో వివరిం చారు. అడ్డుకోబోయిన సూపర్‌వైజర్‌ బండారి అఖిల్‌ను దూషించి బెదిరిం పులకు పాల్ప డ్డారు. బాధితుడు రాఘవేంద్ర శనివారం ఉదయం పోలీసులను ఆశ్రయిచాడు. అతడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ రామలింగమయ్య తెలిపారు.

Updated Date - Mar 14 , 2026 | 11:39 PM