Vizianagaram Hostel: ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య
ABN , Publish Date - Jan 03 , 2026 | 05:18 AM
విజయనగరం జేఎన్‌టీయూలో ఓ ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
విజయనగరం క్రైం/రూరల్, జనవరి 2(ఆంధ్రజ్యోతి): విజయనగరం జేఎన్‌టీయూలో ఓ ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈఈఈ రెండో సంవత్సరం చదువుతున్న వి. వెంకట ఉదయ తేజ(19) శుక్రవారం ఉదయం తోటి విద్యార్థులతో గడిపాడు. వారితో పాటు అల్పాహరం చేయకపోగా, కళాశాలకు వెళ్లకుండా హాస్టల్ గదిలో ఒక్కడే ఉన్నాడు. మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో తోటి విద్యార్థులు వచ్చి తలుపులు కొట్టినా, ఫోన్ చేసినా స్పందించలేదు. అనుమానం వచ్చిన వసతి గృహం నిర్వాహకులు తలుపులు విరగ్గొట్టి చూడగా తేజ ఫ్యాన్‌కి ఉరి వేసుకుని కన్పించాడు. కళాశాల అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. విశాఖలో ఉంటున్న విద్యార్థి తండ్రి శ్రీనివాసరావు, కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. అయితే విద్యార్థి ఆత్మహత్యకు కారణాలు తెలియలేదని విజయనగరం రూరల్ ఎస్‌ఐ అశోక్‌కుమార్ తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.