Share News

బెట్టింగ్‌ భూతానికి ఇంజనీరింగ్‌ విద్యార్థి బలి

ABN , Publish Date - Apr 02 , 2026 | 04:20 AM

క్రికెట్‌ బెట్టింగ్‌ యువత ప్రాణాలను బలి తీసుకుంటోంది. బెట్టింగ్‌లో డబ్బు నష్టపోయిన ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం నాయుడుపాలేనికి చెందిన ఇంజినీరింగ్‌ విద్యార్థి యాదాల తిరుపతిరావు...

బెట్టింగ్‌ భూతానికి ఇంజనీరింగ్‌ విద్యార్థి బలి

  • ఆత్మహత్యాయత్నం.. చికిత్స పొందుతూ మృతి

ఒంగోలు క్రైం, ఏప్రిల్‌ 28(ఆంధ్రజ్యోతి): క్రికెట్‌ బెట్టింగ్‌ యువత ప్రాణాలను బలి తీసుకుంటోంది. బెట్టింగ్‌లో డబ్బు నష్టపోయిన ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం నాయుడుపాలేనికి చెందిన ఇంజినీరింగ్‌ విద్యార్థి యాదాల తిరుపతిరావు(21) ఆత్మహత్యకు యత్నించి చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందాడు. తిరుపతిరావు ఒంగోలులోని ఓ ప్రైవేటు ఇంజనీరింగ్‌ కళాశాలలో ఇంజినీరింగ్‌ మూడో సంవత్సరం చదువుతున్నాడు. అమ్మనాన్నలకు అబద్ధాలు చెప్పి డబ్బులు తీసుకొని బెట్టింగ్‌లో పొగొట్టుకున్నాడు. దీంతో గత నెల 28న కలుపు నివారణ మందును తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. పోలీసులకు బెట్టింగ్‌ల కారణంగానే ఆత్మహత్యకు యత్నించినట్టు స్టేట్‌మెంట్‌ ఇచ్చిన తిరుపతిరావు చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. ఒంగోలు తాలుకా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Apr 02 , 2026 | 04:20 AM