‘లోవోల్టేజీ’ నివారణకు 8 వేల కోట్లు: గొట్టిపాటి
ABN , Publish Date - Feb 21 , 2026 | 04:57 AM
రాష్ట్రంలో విద్యుత్తు లోవోల్టేజీ సమస్య నివారణకు రూ.8 వేల కోట్లతో చర్యలు చేపడుతున్నామని ఇంధన మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు.
ఇంటర్నెట్ డెస్క్: రాష్ట్రంలో విద్యుత్తు లోవోల్టేజీ సమస్య నివారణకు రూ.8 వేల కోట్లతో చర్యలు చేపడుతున్నామని ఇంధన మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. ఇంధన శాఖకు కేటాయించిన రూ.13,942 కోట్ల బడ్జెట్ ప్రతిపాదనలను సభ ముందుంచారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి మూలస్తంభమైన విద్యుత్తు రంగంలో సంస్కరణలకు సీఎం చంద్రబాబు నాంది పలికారని చెప్పారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ట్రూడౌన్‌లో భాగంగా 13 పైసలు తగ్గించామన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో తొమ్మిదిసార్లు విద్యుత్తు చార్జీలు పెంచారని, రూ.30వేల కోట్ల ట్రూఅప్ చార్జీలు వేశారని, రెన్యూవబుల్ ఎనర్జీ డెవలపర్స్‌ను బెదిరించారని ఆరోపించారు.