Share News

దేవదాయ శాఖ ఏసీ శాంతి రిమాండ్‌ పొడిగింపు

ABN , Publish Date - Apr 22 , 2026 | 05:09 AM

ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్న కేసులో రిమాండ్‌ ఖైదీగా ఉన్న దేవదాయ శాఖ సహాయ కమిషనర్‌ కాళింగిరి శాంతికి వచ్చే నెల ఐదో తేదీ వరకు న్యాయస్థానం రిమాండ్‌ పొడిగించింది.

దేవదాయ శాఖ ఏసీ శాంతి రిమాండ్‌ పొడిగింపు

విజయవాడ, ఏప్రిల్‌ 21 (ఆంధ్రజ్యోతి): ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్న కేసులో రిమాండ్‌ ఖైదీగా ఉన్న దేవదాయ శాఖ సహాయ కమిషనర్‌ కాళింగిరి శాంతికి వచ్చే నెల ఐదో తేదీ వరకు న్యాయస్థానం రిమాండ్‌ పొడిగించింది. విజయవాడ జిల్లా జైల్లో ఉన్న ఆమెకు రిమాండ్‌ గడువు ముగియడంతో మంగళవారం కోర్టులో హాజరుపరిచారు. ఆమెకు వచ్చే నెల ఐదో తేదీ వరకు రిమాండ్‌ పొడిగిస్తూ న్యా యాధికారి పి.భాస్కరరావు ఉత్తర్వులు ఇచ్చారు. కాగా.. శాంతిని రెండోసారి మూడు రోజులపాటు కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ అధికారులు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ 24వ తేదీకి వాయిదా పడింది. ఏసీబీ పిటిషన్‌పై శాంతి తరపు న్యాయవాది గోలి నరసింహరావు కౌంటర్‌ దాఖలు చేశారు. న్యాయాధికారి పి.భాస్కరరావు తదుపరి విచారణను 24వ తేదీకి వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Updated Date - Apr 22 , 2026 | 05:10 AM