Share News

‘ఈ-నామ్‌’కు నేటితో పదేళ్లు!

ABN , Publish Date - Apr 14 , 2026 | 05:06 AM

దేశంలో ఎలక్ర్టానిక్‌ నేషనల్‌ అగ్రికల్చర్‌ మార్కెట్‌ (ఈ-నామ్‌) విధానం ప్రవేశపెట్టి మంగళవారం నాటికి పదేళ్లు పూర్తయ్యింది. వ్యవసాయ ఉత్పత్తుల కోసం ఏకీకృత జాతీయ మార్కెట్‌ను...

‘ఈ-నామ్‌’కు నేటితో పదేళ్లు!

  • విజయవంతంగా సాగుతున్న ఎలక్ర్టానిక్‌ జాతీయ వ్యవసాయ మార్కెట్‌ విధానం

  • రైతులకు మెరుగైన ధర అందించడమే లక్ష్యంగా ఈ-నామ్‌ సేవలు

అమరావతి, ఏప్రిల్‌ 13(ఆంధ్రజ్యోతి): దేశంలో ఎలక్ర్టానిక్‌ నేషనల్‌ అగ్రికల్చర్‌ మార్కెట్‌ (ఈ-నామ్‌) విధానం ప్రవేశపెట్టి మంగళవారం నాటికి పదేళ్లు పూర్తయ్యింది. వ్యవసాయ ఉత్పత్తుల కోసం ఏకీకృత జాతీయ మార్కెట్‌ను సృష్టించడానికి 2016 ఏప్రిల్‌ 14న ప్రధానమంత్రి నరేంద్రమోదీ అఖిల భారత స్థాయిలో ఈ-నామ్‌ ట్రేడింగ్‌ పోర్టల్‌ను ప్రారంభించారు. దేశంలోని 23 రాష్ట్రాలు, నాలుగు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 1,522 మండీల ద్వారా ఈ-నామ్‌ సేవలు అందిస్తోంది. దేశవ్యాప్తంగా 231 రకాల పంట ఉత్పత్తులకు ఈ-నామ్‌లో వర్తకం జరుగుతోంది. దీనిలో దేశవ్యాప్తంగా 2.72లక్షల మంది వ్యాపారులు నమోదవగా, 1.80లక్షల యూనిఫైడ్‌ లైసెన్సులు జారీ అయ్యాయి. గతేడాది మార్చి నాటికే రూ.4.20లక్షల కోట్ల లావాదేవీలు జరిగాయి. అత్యధికంగా తమిళనాడులో 213, రాజస్థాన్‌లో 173, ఉత్తరప్రదేశ్‌లో 162 కేంద్రాల్లో ఈ-నామ్‌ మార్కెట్లు పని చేస్తున్నాయి. ఏపీలో 33 మార్కెట్లలో ఈ-నామ్‌ విధానం ఉండగా, సుమారు 4వేల మంది వ్యాపారులు నమోదు చేసుకోగా, అందరికీ యూనిఫైడ్‌ లైసెన్సులు జారీ అయ్యాయి. ప్రధానంగా ఆదోని, కర్నూలు, గుంటూరు, దుగ్గిరాల, ఎమ్మిగనూరు, కడప, అనంతపురం మార్కెట్‌ యార్డుల్లో ఈ-నామ్‌ కార్యకలాపాలు సాగుతున్నాయి.

Updated Date - Apr 14 , 2026 | 05:06 AM