Share News

TTD Orders Probe: తిరుమలలో ఖాళీ మద్యం సీసాల కలకలం

ABN , Publish Date - Jan 05 , 2026 | 04:33 AM

తిరుమలలో ఖాళీ మద్యం సీసాలు కనిపించడం కలకలం సృష్టించింది. గరుడ పోలీస్‌ విశ్రాంతి భవనం వద్ద ఇవి కనిపించాయి.

TTD Orders Probe: తిరుమలలో ఖాళీ మద్యం సీసాల కలకలం

తిరుమల/తిరుపతి(నేరవిభాగం), జనవరి 4(ఆంధ్రజ్యోతి): తిరుమలలో ఖాళీ మద్యం సీసాలు కనిపించడం కలకలం సృష్టించింది. గరుడ పోలీస్‌ విశ్రాంతి భవనం వద్ద ఇవి కనిపించాయి. నిబంధనలకు విరుద్ధంగా తిరుమలకు మద్యం వస్తుంటే నిఘా వ్యవస్థ ఏం చేస్తోందని, ఇప్పటికే మద్యం సేవించిన వారు పలు ఘర్షణలకు కూడా దిగారంటూ కొన్ని ఫొటోలు వైరల్‌ అవుతున్నాయి. దీనికి టీటీడీ స్పందించి ప్రకటన విడుదల చేసింది. ‘బాలాజీ నగర్‌కు ఆనుకుని ఉన్న ఔటర్‌ రింగు రోడ్డు సమీపంలోని చెట్ల మధ్య కొన్ని ఖాళీ మద్యం బాటిళ్లను కనుగొన్నాం. సీసీ టీవీల ద్వారా ఇందుకు కారణమైన సంబంధిత వ్యక్తులపైనా, అలాగే విధుల్లో నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపైనా చర్యలు తీసుకుంటాం’ అని పేర్కొంది. దీనిపై తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు స్పందించారు. పోలీసు అతిథి గృహం వద్ద మద్యం బాటిళ్లు లభించినట్టు ప్రచారం అవుతోందని, నిజానికి అతిథి గృహానికి ఎలాంటి సంబంధం లేదని ఒక ప్రకటనలో తెలిపారు. ఎవరైనా తాగి పడేశారా లేదా ఉద్దేశపూర్వకంగా పాత బాటిళ్లు తీసుకొచ్చి పెట్టారా? అనేది సీసీ కెమెరాల ద్వారా పరిశీలిస్తామని పేర్కొన్నారు.

Updated Date - Jan 05 , 2026 | 04:34 AM