Share News

Modern Technology: ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవాలి

ABN , Publish Date - Jan 02 , 2026 | 05:10 AM

మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఆధునిక సాంకేతికతను ఉద్యోగులు అలవర్చుకోవాలని సమాచార...

Modern Technology: ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవాలి

  • ఐ అండ్‌ పీఆర్‌ డైరెక్టర్‌ విశ్వనాథన్‌

అమరావతి, జనవరి 1(ఆంధ్రజ్యోతి): మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఆధునిక సాంకేతికతను ఉద్యోగులు అలవర్చుకోవాలని సమాచార, పౌర సంబంధాల శాఖ డైరెక్టర్‌ కేఎస్‌ విశ్వనాథన్‌ సూచించారు. గురువారం విజయవాడలోని ఐ అండ్‌ పీఆర్‌ కమిషనరేట్‌లో జరిగిన నూతన సంవత్సర వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఉద్యోగులు ఎప్పటికప్పుడు ఏఐ, చాట్‌జీపీటీ వంటి సాంకేతికతను అందిపుచ్చుకుంటే.. పనిలో వేగంతో పాటు నాణ్యత పెరుగుతుందన్నారు. కొత్త ప్రచార విధానాలను అమల్లోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సమాచార శాఖ ఉన్నతాధికారులు స్వర్ణలత, కిరణ్‌ కుమార్‌, సూర్యచంద్రరావు పాల్గొన్నారు.

Updated Date - Jan 02 , 2026 | 05:10 AM