ఉద్యోగులు సమయపాలన పాటించాలి
ABN , Publish Date - Mar 13 , 2026 | 11:54 PM
మండలంలోని సచివాలయ ఉద్యోగులు సమయపాలన పాటించాలని సెట్కూరు సీఈవో డా.వేణుగోపాల్, సంక్షేమ విద్యా సహాయకులు ప్రవీణ్ కుమార్ అన్నారు.
మద్దికెర, మార్చి 13 (ఆంధ్రజ్యోతి): మండలంలోని సచివాలయ ఉద్యోగులు సమయపాలన పాటించాలని సెట్కూరు సీఈవో డా.వేణుగోపాల్, సంక్షేమ విద్యా సహాయకులు ప్రవీణ్ కుమార్ అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని హంపా సచివాలయం, ఎంపీడీవో కార్యాలయంలో రికార్డులను పరిశీలించారు. అనంతరం విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులు, సచివాలయ ఉద్యోగులు సమయానికి రావాలన్నారు. ప్రతి రోజు ఉదయం, సాయంత్రం ముఖ హాజరు తప్పకుండా వేసుకోవాలన్నారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి ఉద్యోగి ప్రభుత్వ పథకాలను ప్రజల వద్దకు తీసుకెళ్లాలని తెలిపారు. అనంతరం కస్తూర్బా, ఆదర్శ పాఠశాలలను తనిఖీ చేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో కొండయ్య, ఎంఈవో రంగస్వామి, ప్రిన్సిపల్స్ నాగరాజు, జ్యోతిరెడ్డి తదితరులు ఉన్నారు.