ఎల్విన్ ఎనర్జీకి రెండు సోలార్ అవార్డులు
ABN , Publish Date - Feb 14 , 2026 | 02:29 AM
రాష్ట్రానికి చెందిన ప్రముఖ సోలార్ పరిశ్రమ ఎల్విన్ ఎనర్జీ రెండు ప్రతిష్ఠాత్మక అవార్డులను సొంతం చేసుకుంది. సోలార్ రంగానికి చెందిన ప్రముఖ గ్లోబల్ పబ్లికేషన్లు ఈక్వీ మ్యాగజైన్, సోలార్ క్వార్టర్...
అమరావతి, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రానికి చెందిన ప్రముఖ సోలార్ పరిశ్రమ ఎల్విన్ ఎనర్జీ రెండు ప్రతిష్ఠాత్మక అవార్డులను సొంతం చేసుకుంది. సోలార్ రంగానికి చెందిన ప్రముఖ గ్లోబల్ పబ్లికేషన్లు ఈక్వీ మ్యాగజైన్, సోలార్ క్వార్టర్ ఈ అవార్డులను అందజేశాయి. ఈక్వీ మ్యాగజైన్ నుంచి హైగ్రోత్ అండ్ క్వాలిటీ ఎక్సలెన్స్ అవార్డు దక్కించుకోగా, సోలార్ క్వార్టర్ నుంచి సోలార్ ఈపీసీ కంపెనీ ఆఫ్ ది ఇయర్ అవార్డును ఎల్విన్ ఎనర్జీ దక్కించుకుంది. ఈ సందర్భంగా ఎల్విన్ ఎనర్జీ మేనేజింగ్ డైరెక్టర్ విజయభాస్కర్ మాట్లాడుతూ.. కస్టమర్ సంతృప్తిని ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్న తమ ప్రయత్నాలకు ఈ అవార్డులు గుర్తింపుగా నిలిచాయన్నారు.