Share News

అమ్మానాన్నా లేరు.. నన్ను ఆదుకోరూ!

ABN , Publish Date - Jun 23 , 2026 | 05:06 AM

కృష్ణా జిల్లా హనుమాన్‌ జంక్షన్‌కు చెందిన మేడేపల్లి జ్యోతి అప్లాస్టిక్‌ అనీమియా అనే రకానికి చెందిన బోన్‌మ్యారో వ్యాధి సోకి ప్రాణాలతో పోరాడుతూ దాతల సాయం కోసం ఎదురుచూస్తోంది.

అమ్మానాన్నా లేరు.. నన్ను ఆదుకోరూ!

  • బోన్‌మ్యారో వ్యాధితో బాధపడుతున్న యువతి

  • ట్రాన్స్‌ప్లాంటేషన్‌, చికిత్సకు రూ.31 లక్షలు అవసరం

ఏలూరు అర్బన్‌, జూన్‌ 22 (ఆంధ్రజ్యోతి): కృష్ణా జిల్లా హనుమాన్‌ జంక్షన్‌కు చెందిన మేడేపల్లి జ్యోతి అప్లాస్టిక్‌ అనీమియా అనే రకానికి చెందిన బోన్‌మ్యారో వ్యాధి సోకి ప్రాణాలతో పోరాడుతూ దాతల సాయం కోసం ఎదురుచూస్తోంది. ఆమె తల్లి క్యాన్సర్‌తో మరణించగా, తండ్రి కొన్నేళ్ల క్రితమే ఇల్లు విడిచి వెళ్లిపోయాడు. బీటెక్‌ చదివిన జ్యోతి తమ్ముడితో కలిసి జీవిస్తోంది. అసహజ రుతుక్రమం, రక్తపు నిల్వలు అమాంతంగా పడిపోవడం, అసాధారణ స్థాయికి దిగజారిన ప్లేట్‌లెట్స్‌ కౌంట్‌ ఆమె శరీరాన్ని కుంగదీశాయి. విజయవాడ మణిపాల్‌ ఆస్పత్రి వైద్యులను సంప్రదించగా, జ్యోతి అప్లాస్టిక్‌ అనీమియా రకానికి చెందిన బోన్‌మ్యారో వ్యాధి బారిన పడినట్టు గుర్తించారు. ఈ వ్యాధి నుంచి శాశ్వతంగా బయటపడాలంటే ఎముక మజ్జ మార్పిడి శస్త్ర చికిత్సకు రూ.25 లక్షలు, మందులు, వైద్య పర్యవేక్షణ ఖర్చుల నిమిత్తం మరో రూ.6 లక్షలు అవసరమని తెలిపారు. ఎన్టీఆర్‌ వైద్యసేవ కింద రూ.10 లక్షలు సమకూరతాయని, మిగిలిన డబ్బు చూసుకోవాలని సూచించారు. ఆమెను కాపాడేందుకు తాత్కాలికంగా వారానికోసారి రక్తం, ప్లేట్‌లెట్లను ఎక్కిస్తున్నారు. మరో 5 వారాల్లోగా శస్త్ర చికిత్స జరగాల్సి ఉంది. జ్యోతి శస్త్రచికిత్సకు అవసరమైన నిధులకోసం మణిపాల్‌ ఆసుపత్రి మానవతా దృక్పథంతో ఓ యాప్‌ రూపొందించగా ఇప్పటి వరకు రూ.6 లక్షలు సమకూరాయి. ఆమె బ్యాంకు (ఎస్‌బీఐ) ఖాతా నంబరు 31556920173 (మేడేపల్లి జ్యోతి), ఐఎ్‌ఫఎస్‌సీ నంబరు ఎస్‌బీఐఎన్‌ 0004700, హనుమాన్‌ జంక్షన్‌ బ్రాంచికి లేదా ఫోన్‌ పే/యూపీఐ నంబరు 83175 94114కు పంపాలని విజ్ఞప్తి చేస్తోంది.

Updated Date - Jun 23 , 2026 | 05:06 AM