బతికున్నంత కాలం జైల్లోనే!
ABN , Publish Date - Jul 09 , 2026 | 04:44 AM
బాలికపై అఘాయిత్యం, హత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తికి బతికి ఉన్నంత కాలం జీవిత ఖైదు, రూ.35 వేల జరిమానా విధించారు. ఏలూరు పోక్సో కోర్టు న్యాయాధికారి..
బాలికపై అత్యాచారం కేసులో ఏలూరు పోక్సో కోర్టు తీర్పు
ఏలూరు క్రైం, జూలై 8(ఆంధ్రజ్యోతి): బాలికపై అఘాయిత్యం, హత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తికి బతికి ఉన్నంత కాలం జీవిత ఖైదు, రూ.35 వేల జరిమానా విధించారు. ఏలూరు పోక్సో కోర్టు న్యాయాధికారి కానుగుల వాణిశ్రీ బుధవారం ఈ తీర్పు ఇచ్చారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం 2015 అక్టోబరు 21న ద్వారకాతిరుమల మండలంలోని ఒక గ్రామంలో బాలిక తల్లిదండ్రులపై వడ్లమూడి బాలకృష్ణ(39) ఇనుప రాడ్డుతో దాడి చేశాడు. అనంతరం వారి 11 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. సాక్ష్యాధారాలను చెరిపేసేందుకు బాలిక కాళ్లు, చేతులు కట్టేసి, వంట గ్యాస్ లీక్‌చేసి నిప్పు పెట్టాడు. ఆ బాలిక ప్రాణాలు కాపాడుకుని బంధువుల ఇంటికి చేరుకుని దారుణాన్ని వివరించింది.