Share News

డిన్నర్‌కు పిలిస్తే వెళ్లానంతే!

ABN , Publish Date - Mar 21 , 2026 | 04:32 AM

తానెలాంటి తప్పూ చేయలేదని, డ్రగ్స్‌ తీసుకోలేదని ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్‌కుమార్‌ యాదవ్‌ టీడీపీ అధిష్ఠానానికి వివరణ ఇచ్చారు.

డిన్నర్‌కు పిలిస్తే వెళ్లానంతే!

  • డ్రగ్స్‌ తీసుకోలేదు.. తప్పు చేయలేదు: ఎంపీ పుట్టా

  • టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడికి లేఖ.. క్రమశిక్షణ కమిటీకి, లోకేశ్‌కు పంపిన పల్లా

అమరావతి, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): తానెలాంటి తప్పూ చేయలేదని, డ్రగ్స్‌ తీసుకోలేదని ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్‌కుమార్‌ యాదవ్‌ టీడీపీ అధిష్ఠానానికి వివరణ ఇచ్చారు. హైదరాబాద్‌లోని మెయినాబాద్‌ ఫాం హౌస్‌లో 14న జరిగిన ఘటనలో డ్రగ్స్‌ తీసుకున్నట్లు ఆయనపై వచ్చిన ఆరోపణలకు 5 రోజుల్లో వివరణ ఇవ్వాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఈ నెల 15న ఆయనకు షోకాజ్‌ నోటీసు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై మహేశ్‌ పంపిన వివరణ లేఖ శుక్రవారం రాష్ట్ర అధ్యక్షుడికి చేరింది. కేవలం డిన్నర్‌కు పిలిస్తే అక్కడకు వెళ్లానని.. డ్రగ్స్‌ తీసుకోలేదని అందులో ఆయన పేర్కొన్నారు. ఈ వివరణను పల్లా పార్టీ క్రమశిక్షణ కమిటీకి, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌కు పంపారు. క్రమశిక్షణ కమిటీలో చర్చించిన అనంతరం అధిష్ఠానం స్పందించే అవకాశం ఉంది.

Updated Date - Mar 21 , 2026 | 04:33 AM