Share News

గేమ్స్‌ ఆడొద్దంటూ తండ్రి మందలించాడని కొడుకు ఆత్మహత్య

ABN , Publish Date - Jun 10 , 2026 | 05:47 AM

ఏ పనీ చేయకుండా సెల్‌ఫోన్‌లో గేమ్స్‌ ఆడుతూ గడుపుతున్నావంటూ... తండ్రి మందలించాడని కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు.

 గేమ్స్‌ ఆడొద్దంటూ తండ్రి మందలించాడని కొడుకు ఆత్మహత్య

టి.నరసాపురం, జూన్‌ 9(ఆంధ్రజ్యోతి): ఏ పనీ చేయకుండా సెల్‌ఫోన్‌లో గేమ్స్‌ ఆడుతూ గడుపుతున్నావంటూ... తండ్రి మందలించాడని కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు. ఏలూరు జిల్లా నూజివీడు మండలం రామన్నగూడెంకు చెందిన మొక్కరాల సత్యపవన్‌కుమార్‌ టి.నరసాపురం మండలం అల్లంచర్లరాజుపాలెం గ్రామ శివార్లలో వ్యవసాయ కూలి పనులు చేసుకుంటూ భార్య పిల్లలతో జీవిస్తున్నాడు. అతని రెండో కుమారుడు లోకేశ్‌(19) డిగ్రీ ఫస్ట్‌ ఇయర్‌ చదువుతూ వేసవి సెలవులకు వచ్చి ఏ పనీ లేకుండా తిరుగుతూ సెల్‌ఫోన్‌లో గేమ్స్‌ ఆడుతున్నాడు. సోమవారం తండ్రి మందలించడంతో తోటలో ఉన్న కలుపు మందు తాగాడు. కుటుంబ సభ్యులు ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో చేర్పించగా, చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. ఎస్‌ఐ ఎం.జయబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Jun 10 , 2026 | 05:47 AM