Share News

Elephant Movement: తిరుమల ఘాట్‌ రోడ్డులో ఏనుగుల కలకలం

ABN , Publish Date - Jan 10 , 2026 | 05:35 AM

తిరుమల నుంచి తిరుపతికి వెళ్లే మొదటి ఘాట్‌ రోడ్డులో శుక్రవారం ఏనుగుల సంచారం కలకలం రేపింది.

Elephant Movement: తిరుమల ఘాట్‌ రోడ్డులో ఏనుగుల కలకలం

తిరుమల, జనవరి 9(ఆంధ్రజ్యోతి): తిరుమల నుంచి తిరుపతికి వెళ్లే మొదటి ఘాట్‌ రోడ్డులో శుక్రవారం ఏనుగుల సంచారం కలకలం రేపింది. ఏడో మైలు వద్ద అడవి లోపలి నుంచి ఏనుగుల గుంపు రోడ్డుకు సమీపంగా వచ్చింది. గుర్తించిన వాహనదారులు ఆందోళన చెందారు. కొందరు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు సంఘటనా స్థలానికి చేరుకుని ఏనుగులను అటవీ ప్రాంతంలోకి మళ్లించారు. ఇదే ప్రాంతంలో తరచూ ఏనుగుల సంచారం కనిపిస్తోంది.

Updated Date - Jan 10 , 2026 | 05:37 AM