Share News

Tirumala: తిరుమలలో ఏనుగుల గుంపు కలకలం

ABN , Publish Date - Jan 20 , 2026 | 05:25 AM

తిరుమలలో సోమవారం తెల్లవారుజామున పావినాశనం మార్గంలోని పార్వేట మండపం వద్ద ఏనుగుల గుంపు గంటన్నర పాటు హల్‌చల్‌ చేసింది.

Tirumala: తిరుమలలో ఏనుగుల గుంపు కలకలం

  • పార్వేట మండపం వద్ద హల్‌చల్‌

తిరుమల, జనవరి 19(ఆంధ్రజ్యోతి): తిరుమలలో సోమవారం తెల్లవారుజామున పావినాశనం మార్గంలోని పార్వేట మండపం వద్ద ఏనుగుల గుంపు గంటన్నర పాటు హల్‌చల్‌ చేసింది. 12 ఏనుగులతో కూడిన గుంపు అడవిలోంచి శ్రీగంధం వనం ధ్వంసం చేసుకుంటూ, పార్వేట మండపం కంచెను కూల్చేస్తూ రోడ్డు వైపునకు దూసుకువచ్చాయి. సమీపంలోని వెదురుపొదలను విరిచేశాయి. వేకువజామున 5 గంటల సమయంలో ఏనుగులు గుంపును కొందరు స్థానికులు గుర్తించి ఫారెస్ట్‌, విజిలెన్స్‌ అధికారులకు సమాచారమిచ్చారు. ఘటనా ప్రాంతానికి చేరుకున్న అధికారులు ముందు జాగ్రత్తగా ఆ మార్గంలో వాహన రాకపోకలను నిలిపివేశారు. ఏనుగులను అడవిలోకి పంపేందుకు శబ్ధాలు చేశారు. అవి పాపనాశనం డ్యాములో నీళ్లు తాగి, తిరిగి అడవిలోకి వెళ్లిపోయాయి. ఆ తర్వాతే వాహనాలను అనుమతించారు. పిల్ల ఏనుగులతో కూడిన ఈ గుంపు తరుచూ నీటి కోసం ఇలా వస్తోందని, వాటిని ఇబ్బంది పెట్టనంతవరకు ఎలాంటి సమస్య ఉండదని అధికారులు తెలిపారు.

Updated Date - Jan 20 , 2026 | 05:26 AM