Share News

విద్యుత్‌ లైన్‌మెన్‌ పోస్టులను భర్తీ చేస్తాం: గొట్టిపాటి

ABN , Publish Date - Feb 27 , 2026 | 04:11 AM

రాష్ట్రంలో విద్యుత్‌ సరఫరా నాణ్యత మెరుగుపర్చేందుకు మరింత సిబ్బందిని నియమించాల్సిన అవసరం ఉందని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ స్పష్టం చేశారు.

విద్యుత్‌ లైన్‌మెన్‌ పోస్టులను భర్తీ చేస్తాం: గొట్టిపాటి

అమరావతి, ఫిబ్రవరి 26(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో విద్యుత్‌ సరఫరా నాణ్యత మెరుగుపర్చేందుకు మరింత సిబ్బందిని నియమించాల్సిన అవసరం ఉందని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ స్పష్టం చేశారు. గురువారం మండలిలో విద్యుత్‌ లైన్‌మెన్ల నియామకంపై టీడీపీ సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి స్పందించారు. లైన్‌మెన్ల పోస్టుల నియామకానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. కొత్త స్తంభాలు, ట్రాన్స్‌ఫారాల ఏర్పాటు నిరంతర ప్రక్రియ, అవసరాన్ని బట్టి జరుగుతుందని తెలిపారు. డిస్కంల వద్ద అందుబాటులో ఉన్న విద్యుత్‌ స్తంభాలు, ట్రాన్స్‌ఫారాల నిల్వల వివరాలు వెల్లడించారు.

Updated Date - Feb 27 , 2026 | 04:11 AM