Share News

టీటీడీకి విద్యుత్‌ బస్సు విరాళం

ABN , Publish Date - May 31 , 2026 | 06:37 AM

ఢిల్లీలోని నయతి సంస్థ అధినేత్రి నీరా రాడియా శనివారం ఉదయం టీటీడీకి రూ.1.13 కోట్ల విలువైన ఒలెక్ర్టా (ఎలక్ట్రిక్‌) బస్సును అందజేశారు.

టీటీడీకి విద్యుత్‌ బస్సు విరాళం

తిరుమల, మే 30 (ఆంధ్రజ్యోతి): ఢిల్లీలోని నయతి సంస్థ అధినేత్రి నీరా రాడియా శనివారం ఉదయం టీటీడీకి రూ.1.13 కోట్ల విలువైన ఒలెక్ర్టా (ఎలక్ట్రిక్‌) బస్సును అందజేశారు. తిరుమల శ్రీవారి ఆలయం ముందు బస్సుకు ప్రత్యేక పూజలు నిర్వహించి తాళాలను టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడికి, అదనపు ఈవో వెంకయ్య చౌదరికి అందజేశారు. ఈ బస్సును తిరుమలలో భక్తుల సౌకర్యార్థం ఉచిత బస్సుగా వినియోగించనున్నారు.

Updated Date - May 31 , 2026 | 06:38 AM